Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వెబ్ సీరీస్ కి ఓకే చెప్పిన నాని?

Nani gives nod for web series
  • డిజిటల్ ఎంట్రీకి నాని గ్రీన్ సిగ్నల్ 
  • ప్రస్తుతం 'టక్ జగదీశ్' సినిమా చేస్తున్న నాని 
  • లైన్లో 'శ్యామ్ సింగరాయ్', 'అంటే సుందరానికి'
  • తర్వాత నెట్ ఫ్లిక్స్ వెబ్ సీరీస్ షూటింగ్    
ఈవేళ ఓటీటీ ప్రాధాన్యం అందరికీ తెలిసిపోయింది. థియేటర్ కి ప్రత్యామ్నాయంగా ఈ ఓటీటీ నిలబడుతోంది. ముఖ్యంగా లాక్ డౌన్ సమయంలో ఈ ప్లాట్ ఫామ్ ప్రాధాన్యం వెల్లడైంది. థియేటర్లు మూతబడిన కారణంగా రిలీజ్ కాకుండా ఆగిపోయిన ఎన్నో సినిమాలు ఓటీటీ ద్వారా వెలుగుచూశాయి. దీంతో ఇప్పుడు దీని ప్రాధాన్యం మరింతగా పెరిగింది. భవిష్యత్తులో ఇది మరింతగా పెరుగుతుందని భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో పలువురు తారలు ఇటు సినిమాలు చేస్తూనే... అటు ఓటీటీ సంస్థల కోసం వెబ్ సీరీస్ వంటివి చేస్తున్నారు. ఇప్పటికే పలువురు హీరోయిన్లు వీటితో బిజీగా వున్నారు. తాజాగా నేచురల్ స్టార్ నాని కూడా డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ నిర్మించే ఓ వెబ్ సీరీస్ లో నాని ప్రధాన పాత్ర పోషించనున్నట్టు సమాచారం.

ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో నాని 'టక్ జగదీశ్' సినిమా చేస్తున్నాడు. ఇది త్వరలో పూర్తికానుంది. దీని తర్వాత 'శ్యామ్ సింగరాయ్' సినిమా చేస్తాడు. ఆ తర్వాత 'అంటే సుందరానికి' అనే సినిమా చేయాల్సివుంది. దాని తర్వాత నెట్ ఫ్లిక్స్ సీరీస్ షూటింగ్ చేస్తాడట.
Nani
Tuck Jagadish
OTT
Netflicks

More Telugu News